Site icon NTV Telugu

సాలిడ్ రికార్డు క్రియేట్ చేసిన రామ్

200 Million+ views for iSmart Shankar Hindi Dubbed Version

‘నేను శైలజ’ సినిమా తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందులు పడ్డ రామ్ పోతినేని ఎట్టకేలకు పూరి జగన్నాథ్ తో కలిసి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ కూడా చాన్నాళ్ల నుంచి హిట్ కోసం ఎదురు చూసి ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పటికే తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్లతో సహా కొన్ని రికార్డులు బద్దలు కొట్టగా… ఇప్పుడు తాజాగా యూట్యూబ్ వేదికగా మరో సాలిడ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాని హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా ఏకంగా 200 మిలియన్ల వ్యూస్ దాటేశాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాని యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేశారు. దీంతో సౌత్ కంటెంట్ కు నార్త్ లో ఎంత క్రేజ్ వుంది అనే విషయం అర్థం అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ ‘లైగర్’ అనే సినిమా చేస్తుండగా, లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఒక బైలింగ్వల్ సినిమా చేస్తున్నాడు.

Exit mobile version