NTV Telugu Site icon

ఏక్ మినీ కథ : ట్రెండింగ్ లో ‘సామిరంగా’ సాంగ్

2 Million Views for Saamiranga Lyrical Video Song from Ek Mini Katha

ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘ఏక్ మినీ కథ’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు బాణీలు సమకూరుస్తున్నారు. శ్రీరామ నవమి కానుకగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సామిరంగా పరేషాన్ ఈ జీవితం’ అనే లిరికల్ వీడియో సాంగ్ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ సాంగ్ 2 మిలియన్ వ్యూస్ ను సాధించడం విశేషం. ఈ సాంగ్ కు శ్రీజో లిరిక్స్ అందించగా.. పృథ్వి చంద్ర ఆలపించారు. మధ్యలో వచ్చే రాప్ ను శ్రీనివాస్ జోస్యుల పాడారు.