NTV Telugu Site icon

దూసుకెళ్తున్న ‘టక్ జగదీష్’ టీజర్…!

16 Million views for Tuck Jagadish Teaser

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ‘టక్ జగదీష్’కు థమన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ ను సాధిస్తున్నాయి. తాజాగా ‘టక్ జగదీష్’ టీజర్ 16 మిలియన్ల వ్యూస్ ను దాటేసి… మరిన్ని వ్యూస్ ను రాబట్టే దిశగా దూసుకెళ్తోంది. ముందుముందు ఈ టీజర్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.