మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలకపాత్రల్లో కన్పించనున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వాయిదా పడింది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ‘సీటిమార్’లోని ‘జ్వాలారెడ్డి’ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ ను, లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్ కు యూట్యూబ్ లో 10+ మిలియన్ వ్యూస్, 100కే లైక్స్ వచ్చినట్టు తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ‘జ్వాలారెడ్డి’ సాంగ్ ను శంకర్ బాబు, మంగ్లీ ఆలపించారు. మణిశర్మ సంగీతం అందించగా… కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న “జ్వాలారెడ్డి” లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.
సీటిమార్ : 10 మిలియన్ వ్యూస్ దాటేసిన ‘జ్వాలారెడ్డి’ సాంగ్
