Site icon NTV Telugu

‘ఏవమ్ జగత్’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

ప్రపంచీకరణ నేపధ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. దీనివల్ల నిజంగా మన దేశం అభివృద్ధి చెందిందా? మన కలాం గారి కల, మిషన్ 2020 నెరవేరిందా? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న సినిమా ‘ఏవమ్ జగత్’. ఈ చిత్రాన్ని మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై మునిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్నారు. దినేష్ నర్రా దర్శకుడు.
కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ ”వ్యవసాయం భవిష్యత్తు ఏంటి? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ పండించగల అనుభవం గానీ మన దేశ యువతకి ఉందా? అనే అంశాలను ‘ఏవం జగత్’ మూవీలో చూపిస్తున్నాం. వ్యవసాయంతో పాటు మానవ సంబంధాలతో లకు సమాధానం వెతికే కమల్ అనే ఓ 20 ఏళ్ల యువకుడి కథే ‘ఏవం జగత్’. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో కమల్ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది” అని అన్నారు.

Exit mobile version