NTV Telugu Site icon

ఆసక్తికరంగా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ గాడ్ టీజర్

Priyadarshi's In The Name of God Teaser Released

ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ లో ప్రత్యేకమైన స్క్రిప్ట్ లను ఎంపికల చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ కమెడియన్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ నుండి ఆహాలో ప్రసారం అవుతుంది. తాజాగా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ సీనియర్ హీరో జగపతి బాబు వాయిస్ తో స్టార్ట్ అవుతుంది. ఆయన ఒక ఉడుతను ఎలా పట్టుకుంటారు… ఆ తరువాత ఎలా చంపేస్తారు అనే స్టోరీని టీజర్ కు అనుగుణంగా చెప్పుకొచ్చారు. ఇక టీజర్ లో ప్రియదర్శి, నందిని రాయ్ ల ప్రేమ, తరువాత వచ్చే క్రైమ్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో ప్రియదర్శి లస్ట్ ఫుల్ మ్యాన్ గా కనిపించనున్నారు. మొదటిసారి అతను ఎ-రేటెడ్ పాత్రను చేస్తున్నాడు. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.