Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసిన సినీ కార్మికులు

  • విజయవాడ క్యాంప్ కార్యాలయం నుంచి మంగళగిరి జన సేన పార్టీ కార్యాలయానికి బయల్దేరి వెళ్ళిన డిప్యూటీ సిఎం పవన్
  • వెళ్ళేటపుడు గేట్ దగ్గర సినీ కార్మికులను చూసి ఆగిన డిప్యూటీ సిఎం పవన్
  • అనంతరం కారు దిగి సినీ కార్మికులను కలిసి వినతి పత్రం తీసుకున్న పవన్
  • తమ సమస్యలు పవన్ కు వివరించిన సినీ కార్మికులు
Pawan Cine Workers

Pawan Cine Workers

Cine Workers Met Deputy CM Pawan Kalyan : విజయవాడలో తన డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి మంగళగిరి జన సేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు పవన్ కళ్యాణ్. క్యాంప్ కార్యాలయం నుంచి బయటజయ్ వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర సినీ కార్మికులను చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగారు. ఆ తరువాత కారు దిగి సినీ కార్మికులను కలిసి వినతి పత్రం తీసుకున్నారు.

Kalki 2898 AD: అందరి కళ్ళు కల్కి మీదే.. ఇదెక్కడి క్రేజ్ మావా?

ఈ క్రమంలో తమ సమస్యలు పవన్ కు సినీ కార్మికులు వివరించారు. ఇక ఈ ఉదయమే క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల, నిర్మాతలు సి.అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, డి.సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, వై.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.