NTV Telugu Site icon

RGV : రామ్ గోపాల్ వర్మకు సీఐడీ అధికారులు నోటీసులు.

Rgv

Rgv

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదయింది. రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు అందజేసారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు. రామ్ గోపాల్ వర్మ కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాలను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు. తాజాగా అందిన ఫిర్యాదుల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని తాజాగా సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు రామ్ గోపాల్ వర్మ.  ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సినిమా తీసాడని ఆర్జీవీపై కేసు నమోదు అవగా ఒంగోలులో విచారణను హాజరయ్యాడు ఆర్జీవీ. ఇప్పుడు సీఐడీ అధికారుల నోటీసుల నేపథ్యంలో విచారణకు మినహాయియింపు కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు రామ్ గోపాల్ వర్మ.