భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకులలో ఒకరైన కాశీనాధుని విశ్వనాథ్ పుట్టినరోజు నేడు. ఈరోజు ఆయన 92వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తెలుగు చిత్రసీమలో ఆయనొక అద్భుతమైన దర్శకుడు అన్న విషయం తెలిసిందే. చిరంజీవి, శుభలేఖ సుధాకర్, మమ్ముట్టి, కృష్ణ, చంద్ర మోహన్, రోజా రమణి, వాణిశ్రీ వంటి ప్రముఖులతో సహా చాలా మంది నటులకు మార్గదర్శకత్వం వహించిన దర్శకుడు కె విశ్వనాథ్. తాజాగా మెగాస్టార్ చిరంజీవి లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో పాటు ఉన్న ఫోటోను షేర్ చేశారు.
Read Also : Vijay : చెన్నై ఎలక్షన్స్ లో హీరో వల్ల అసౌకర్యం… సారీ చెప్పిన స్టార్
“గురు తుల్యులు, కళాతపస్వి కే విశ్వనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు… తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసి, తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, ఆ తరువాత అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ వరం” అంటూ ఆయన ఆయురారోగ్యాలతో కలకలం సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు చిరంజీవి. వీరిద్దరి హిట్ చిత్రాలు శుభలేఖ, ఆపత్భాండవుడు మరియు స్వయంకృషి ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు.
