సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్… ఇద్దరు ఒకేరోజు వేర్వేరు చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో చిన్న సినిమాగా సాలిడ్ బజ్‌తో దూసుకోస్తుంది హనుమాన్. మహేష్ బాబు గుంటూరు కారంకు పోటీగా జనవరి 12న రిలీజ్ అవుతోంది హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్‌లో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్… జనవరి 7న గ్రాండ్‌గా హనుమాన్ మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్‌ను సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. ఇదే రోజు విక్టరీ వెంకటేష్ వైజాగ్‌లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు.
వెంకీ మామ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ సైంధవ్ జనవరి 13న రిలీజ్ కానుంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సైంధవ్ ట్రైలర్‌లో వెంకీమామ ఊచకోత కోశాడు. హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా పై ట్రైలర్‌తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదే జోష్ మైంటైన్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్న మూవీ మేకర్స్… సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జనవరి 7న వైజాగ్ లోని గోకుల్ పార్క్, ఆర్‌కె బీచ్‌లో సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు అఫీషయల్‌గా అనౌన్స్ చేసారు. దీంతో హైదరాబాద్‌లో చిరంజీవి, వైజాగ్‌లో వెంకీ మామ ఒకే సమయంలో రచ్చ చేయనున్నారు. మరి మెగాస్టార్ ప్రమోట్ చేస్తున్న హనుమాన్, వెంకీ ‘సైంధవ్’ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.