Site icon NTV Telugu

Akkineni Nagarjuna: ఆ ఫోటో షేర్ చేసి నాగ్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరు

Chiru

Chiru

Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున నేడు తన 63 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం విదితమే. అక్కినేని నట వారసుడిగా విక్రమ్ తో మొదలుపెట్టిన నాగ్ సినీ ప్రస్థానం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఇక నాగ్ బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గా నాగ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఒక అరుదైన ఫోటోను షేర్ చేస్తూ “హ్యాపీ బర్త్ డే మై డియర్ ఫ్రెండ్ నాగార్జున. నీకు మంచి ఆరోగ్యం, సక్సెస్ ఎప్పుడు ఉండాలని కోరుకొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఆ ఫోటోలో చిరంజీవి కూర్చొని ఉండగా ఆయన భుజాలపై నాగ్ చేతులు వేసి కనిపించాడు. ఇక ఒక మ్యాగజైన్ కవర్ కోసం జరిగిన ఫోటోషూట్ కోసం అప్పట్లో చిరు, నాగ్ కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చుసిన అభిమానులు వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోపక్క ఈ ఫోటోను అక్కినేని ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మార్చేశారు. మరి ముందు ముందు అభిమానుల కోరికను ఈ స్టార్ హీరోలు నెరవేరుస్తారో లేదో చూడాలి.

Exit mobile version