Site icon NTV Telugu

Chiranjeevi: మళ్లీ రాజకీయాల్లోకి చిరు.. దూరం కాలేదు అంటూ ట్వీట్

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆచార్యతో ప్రేక్షకులను నిరాశపరిచిన చిరు ఈసారి అభిమానులకు గట్టి హిట్ ఇవ్వాలని కసిగా ఉన్నాడు. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టకపోయేసరికి ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వాటిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. వాయిదా అని వస్తున్న వార్తలు అన్ని రూమర్స్ అని, గాడ్ ఫాదర్ అనుకున్న సమయానికి వస్తాడని చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా చిరంజీవి చేసిన ఒక ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. రాజకీయాల గురించి చిరు ఒక వాయిస్ ట్వీట్ ను షేర్ చేశాడు. “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అంటూ చిరు బేస్ వాయిస్ తో చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చిరు కొన్నేళ్ల క్రితం ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అయితే ఆయనకు రాజకీయం అచ్చిరాలేదు.. దీంతో మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు నోటా రాజకీయం మాట రావడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ డైలాగ్ గాడ్ ఫాదర్ సినిమాలోనిది అయ్యి ఉంటుందని, సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేస్తూ చిరు ఈ డైలాగ్ ను షేర్ చేసి ఉంటారని చెప్తున్నారు. ఏదిఏమైనా ఒక్క డైలాగ్ తో చిరు అటు సినీ, రాజకీయ ప్రముఖులను షాక్ కు గురిచేశాడు.

Exit mobile version