NTV Telugu Site icon

Chiranjeevi: ఇక్కడ డైలాగ్స్ సెట్స్ లోనే రాస్తారు

Chiru

Chiru

Chiranjeevi: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తుండగా.. అమీర్ సరసన కరీనా కపూర్ నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో లాల్ సింగ్ చడ్డా పేరుతో రిలీజ్ చేస్తుండగా.. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అమీర్ ఖాన్, చిరంజీవి, నాగ చైతన్య పాల్గొన్నారు.

సూపర్ హిట్ సినిమాలను చేసిన మెగాస్టార్.. ఈ ఒక్క సినిమాకే ఎందుకు సమర్పకుడిగా మారారు అన్న ప్రశ్నకు చిరు మాట్లాడుతూ “అమీర్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం, అతని సినిమాలు అంటే ఇష్టం, అతని నడవడిక, వ్యక్తిత్వం అంటే ఇష్టం. సినిమాల మీద తను పెట్టే శ్రద్ధ.. వచ్చామా.. మన క్యారెక్టర్ చేశామా అని కాకుండా ఒక సినిమా మేకింగ్ విషయంలో కర్త, కర్మ, క్రియ అన్ని తానే అయ్యి చేయడం అనేది.. ఆ యూనిక్ స్టైల్ ఏ ఇండియన్ యాక్టర్ లో లేదు. అది తనను సపరేట్ ఇమేజ్ లో ఉంచుతోంది. మాలాంటి యాక్టర్లు కూడా చేయాలనుకుంటాం కానీ కొన్ని లిమిటేషన్స్ వలన లిమిటెడ్ గా ఇన్వాల్వ్ అవుతాం తప్ప అమీర్ ఖాన్ లా అన్నీ దగ్గర ఉండి చేయలేము. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు సంబంధించి అమీర్ ఖాన్ వర్క్ షాప్స్ ను నిర్వహించారు. దాదాపు 100 మంది నటులను, టెక్నీషయన్లను కూర్చోపెట్టి హియరింగ్ ఇప్పించారు. డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని వారాలు తీసుకున్నారు.

సెట్స్ లోకి వెళ్లేసరికి నా డైలాగ్ ఏంటి.. అనే ప్రశ్న ఎవరికి ఉండదు. కేవలం నటన మీద మాత్రమే ఏకాగ్రత ఉంటుంది. కానీ ఇక్కడ సెట్స్ లోనే డైలాగ్స్ రాస్తారు.. డైలాగ్స్ రావడం లేదు.. డైలాగ్ చెప్పండి అని ఆ టెన్షన్ లో 100% నటనను ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటివి ఏం లేకుండా మొత్తం నటనమీదే ఏకాగ్రత పెట్టడానికి ముందస్తుగా ఇన్ని చర్యలు తీసుకుంటారు. అది చాలా తక్కువ మందా..? బహుశా అసలు లేరేమో అనుకుంటాను. ఇలాంటివన్నీ తెలిసిన తరువాత అతనికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఏ నటుడైన లవ్ చేయాల్సిందే.. దీంతో అతడు అడిగి అడగగానే అంతకు ముందు ఎప్పుడైనా సమర్పించామా..? లేదా అనే ఆలోచన కూడా రాలేదు. అసలు సమర్పిచడమంటే ఏంటో కూడా తెలియదు నాకు.. అలాంటిది అమీర్ అడగగానే బాధ్యత అనండి .. ప్రేమతో మీరు అందిస్తున్న చిన్న గిఫ్ట్ అనుకున్నాను.. ఈ సినిమాకు నేను ఏ విధంగా అయినా ఉపయోగ పడతాను.. నా పేరు ఉపయోగపడుతుంది అనుకుంటే.. అమీర్ నేను మనస్ఫూర్తిగా ఒప్పుకొంటున్నాను అని చెప్పాను” అని చెప్పుకొచ్చారు.

Show comments