NTV Telugu Site icon

Chiranjeevi: కళ్యాణ్ దేవ్ కూతురు చేసిన పనికి మురిసిపోయిన చిరు

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సినిమాల విషయం పక్కన పెడితే కొద్దిగా గ్యాప్ దొరికినా మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకొంటూ కనిపిస్తాడు చిరు. ముఖ్యంగా చిన్న కూతురు శ్రీజ- కళ్యాణ్ దేవ్ ల ముద్దుల తనయ నవిష్కతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అప్పుడప్పుడు నవిష్క ముద్దు ముద్దు మాటలను, అల్లరి పనులను వీడియోలు తీసి అభిమానులతో పంచుకొంటూ ఉంటాడు. నవిష్కకు ప్రస్తుతం నాలుగేళ్లు. తన ముద్దు ముద్దు మాటలతో తాత చిరుతో ఎన్నో ముచ్చట్లు చెప్తూ ఉంటుంది. ఇక తాజాగా చిరు అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా ఇంట్లో పూజ చేసిన వీడియోను కూడా షేర్ చేస్తూ “అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! అందరి జీవితాలలో విఘ్నాలు తొలగి విజయాలు, సుఖ సంతోషాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు సదా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ వీడియోలో నవిష్క చేసిన పనికి చిరు మురిసిపోయాడు. పంతులు గారు చెప్పిన మంత్రాలను ఎంతో చక్కగా ఉచ్చరించి వినాయకుడికి పూజ చేసి, ఆశీర్వాదాలు తీసుకొంది. అల్లరి చేయకుండా అంత పెద్ద పెద్ద పదాలు నోరు తిరగగపోయినా చెప్పి ఔరా అనిపించింది. ఇక మనవరాలు అంత పద్దతిగా మంత్రాలు చెప్తుంటే మురిసిపోయారు చిరు- సురేఖ దంపతులు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. శ్రీజ తన ఇన్స్టాగ్రామ్ పేరును మార్చడం, మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం లాంటివన్నీ వాటికి సంకేతాలే అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే వీటిపై మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు స్పందించలేదు.