Site icon NTV Telugu

Chiranjeevi : ప్రాణాపాయంలో మెగా అభిమాని.. అండగా మెగాస్టార్

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : ఎవరికి ఆపద వచ్చినా… తెలిసిన వెంటనే వారిని ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆపద అని తెలిసి ఆయనను హైదరాబాద్ పిలిపించి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ తన హీరో బాటలోనే సమాజ సేవలో మునిగిపోయారు. దొండపాటి చక్రధర్ పేదలకు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు, ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఎన్నో కుటుంబాలను, మెగాభిమానుల తరపున ఆదుకున్న దొండపాటి చక్రధర్ కి క్యాన్సర్ సోకింది.

గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో ఉన్నారన్న విషయం మెగాస్టార్ చిరంజీవికి తెలియగానే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పిలిపించి ఒమేగా హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. అంతేకాదు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే చక్రధర్ కు అండగా ఉంటామని ఆయన కుటుంబసభ్యలకు కూడా మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చారు.

Exit mobile version