NTV Telugu Site icon

Chiranjeevi: గిన్నీస్ రికార్డు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

Chiranjeevi

Chiranjeevi

ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 156 సినిమాలకు గాను 537 పాటల్లో 24 వేల డాన్స్ మూవ్స్ చేసినందుకు గాను ది మోస్ట్ ప్రొలొఫిక్ ఇండియన్ యాక్టర్ కేటగిరీలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన తన ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియా వేదిక సుదీర్ఘమైన ట్విట్ చేశారు. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ గురించి నేనెప్పుడూ ఊహించలేదు. సంవత్సరాలుగా నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరు, అంటే నా నిర్మాతలు, దర్శకుల వల్లనే ఇది సాధ్యమైంది.

Also Read: Laapataa Ladies: ఆస్కార్ రేసులో సూపర్ హిట్ మూవీ.. కథ అదిరిపోయింది.. చూశారా?

అద్భుతమైన పాటలను కంపోజ్ చేసిన అందరు సంగీత దర్శకులు, నాకు కొన్ని మరపురాని డ్యాన్స్ మూవ్‌లను కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్‌లు, ఇన్నాళ్లూ నా పనిని మెచ్చుకున్న సినీ ప్రేక్షకులందరూ ఈ రికార్డుకు కారణం. అలాగే మిత్రులు, సహోద్యోగులు, నా ప్రియమైన అభిమానులందరికీ, కుటుంబ సభ్యులకు, సినీ ప్రముఖులకు, పెద్దలకు, రాజకీయ, మీడియా ప్రముఖులకు, పాత్రికేయులకు, గౌరవ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు సహా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మీ ఆప్యాయత, శుభాకాంక్షలు, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాల కోసం ఇప్పుడు, ఎల్లప్పుడూ నేను కృతజ్ఞుడినే అంటూ చిరంజీవి రాసుకొచ్చాారు. ఇక ఇదే అంశం మీద రామ్ చరణ్ కూడా తన తండ్రికి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు.

Show comments