Site icon NTV Telugu

Chiranjeevi : పద్మశ్రీ విజేతలను ఇంటికెళ్ళి సన్మానించిన చిరంజీవి

Chiranjeevi

Chiranjeevi

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక అయ్యారు. అయితే ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపి తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు.

Also Read :Sudigali Sudheer: G.O.A.T కోసం రంగంలోకి సుడిగాలి సుధీర్

ఈ ముగ్గురి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణలు, దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించిన అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించాయి. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని అభివర్ణించారు. ఇదే సందర్భంలో సోషల్ మీడియా ద్వారా కూడా చిరంజీవి పద్మ అవార్డు పొందినవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మమ్ముట్టీ, మాధవన్‌తో పాటు క్రీడారంగం నుంచి రోహిత్ శర్మ, వరల్డ్‌కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, అలాగే డాక్టర్ దత్తాత్రేయుడు నోరికి అభినందనలు తెలియజేశారు.

Exit mobile version