Site icon NTV Telugu

వారిని కొంచెం దూరం పెట్టండి : చిరంజీవి

మా ఎన్నికల పై పెళ్లి సందడి ఫ్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడారు. రెండు మూడు ఏళ్ళు ఉండే పదవికి కోసం ఒక్కరిని మాటలను అనడం.. అనిపించుకోవడం అవసరమా అని అన్నారు. ఇలా అనుకుంటుంటే ఎదురు వారికీ మనం ఎంత లోకువ అయిపోతాం.. ఒక్క పదవి కోసం అంత లోకువ కావాలా అని చిరు ప్రశ్నించారు. అసలు సినీ పరిశ్రమలో ఈ వివాదాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి.. దానికి ఎవరో కారణమో తెలుసుకొని.. ఆ వివాదాలు సృష్టించిన వ్యక్తులను ఇండస్ట్రీకి కొంచెం దూరం గా పెట్టాలి అని సూచించారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దు అని చెప్పిన చిరు… వివాదాలతో లోకువ కావద్దు. ఈ పదవులు తాత్కాలికం. మనమంతా ఒక్కటే కుటుంభం తెలిపారు. మన ఆధిపత్యం చూపించుకోవడానికి.. మన ప్రభావం చూపించడానికి అవతలవారిని కించపరచవలసిన అవసరం లేదు అన్నారు.

Exit mobile version