సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
Also Read : Kuberaa : హార్ట్ ఫుల్ గా సినిమా తీస్తే ఆడియన్స్ ధియేటర్స్ కు వస్తారు : ధనుష్
బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘ఇది నా సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది. అలాంటి ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాను. ఇక్కడ ఉన్నవాళ్లంతా నాకు కావలసిన వాళ్లు. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే ఇది నా సక్సెస్ మీట్ అనిపిస్తోంది. ఇక్కడకి నేను గెస్ట్ గా రాలేదు. మీలో ఒకడిగా, ఆత్మీయుడుగా వచ్చాను. నాగార్జునను ఈ సినిమాకు ముందు ఒకసారి కలిశారు. కుబేర గురించి అడిగాను. ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఎలా ఒప్పుకున్నావు అని అడిగాను. అందుకు బదులుగా నాకు ఎక్కడో డిఫరెంట్ గా చేయాలని ఉంది. కొత్త గేట్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది అలా ఈ సినిమాఉపయోగపడుతుందని నాగార్జున నాతో చెప్పారు. నేను సినిమా చూశాను. ఆయన చెప్పినది 100% కరెక్ట్. ఈ సినిమా తర్వాత తను మరో 40 ఏళ్లు అద్భుతంగా రాణిస్తారనేది వాస్తవం. ఈ క్యారెక్టర్ శేఖర్ రాయడం, అది నాగార్జున ఒప్పుకుని చేయడం ఇదే ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాను’ అని అన్నారు.
