NTV Telugu Site icon

Unstoppable With NBK: ఒకే స్టేజీపై బాలయ్య కోసం చిరంజీవి?

Chiranjeevi Balakrishna

Chiranjeevi Balakrishna

Chiranjeevi and Nagarjuna to be part of Unstoppable With NBK: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుని మరో సీజన్ కి రెడీ అవుతోంది. ఆహాలో ప్రసారం అవబోతున్న ఈ షోకి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది. కొత్త సీజన్‌ సరికొత్త సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతోందని చెబుతున్నారు. నిజానికి మొదటి మూడు సీజన్లలో అనేకమంది హీరోలు, డైరెక్టర్లతో సహా చంద్రబాబు వంటి వారితో సందడి చేసిన ఈ షో ఇప్పుడు మరింత జోష్‌తో సాగనుందని తెలుస్తోంది. ఈ సారి సీజన్లో చిరంజీవితో పాటు నాగార్జున ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

Committee Kurrollu: తొలి రోజే దుమ్ము రేపిన ‘కమిటీ కుర్రోళ్ళు’.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారంటే?

ఈ విషయాన్ని ఒక మీటింగ్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. ఇక అధికారికంగా ప్రకటన వెలువడటమే లేట్ అని చెప్పాలి. ఇక చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన వెలువడవచ్చని టాక్‌ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయింది. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా బాలయ్య-చిరు అభిమానుల మధ్య గొడవలు పీక్స్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు పోటీ తగ్గడంతో పాటు జనసేన టీడీపీ కలిసి పనిచేయడం ఆసక్తికరం. ఇక ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే, అభిమానులకు అంతకుమించిన వినోదం ఏముంటుంది చెప్పండి.

Show comments