NTV Telugu Site icon

Chay – Sobhita: మరోసారి హాట్ టాపిక్ గా చై-శోభిత.. ఇవి గమనించారా?

Sobhitha Chaitanya

Sobhitha Chaitanya

Chay – Sobhita Became Hottopic again with Social Media posts: నాగచైతన్య సమంత విడాకుల తరువాత వారు ఇద్దరూ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అది వైరల్ అవుతూనే వస్తుంది. ఇక సమంత సంగతి అలా ఉంచితే నాగచైతన్య మరోసారి ప్రేమలో పడ్డాడని, తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాలతో మరోసారి ఏడడుగులు వేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ మధ్య ఇద్దరూ లండన్లో ఒకే ఫోటోలో కనిపించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో దాదాపుగా వారిద్దరూ ఇక వివాహం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రచారం మరుగున పడింది. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి సోషల్ మీడియా పోస్టుల కారణంగా మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు.

Salman Khan Firing: కాల్పుల కేసులో తుపాకీ దొరికింది.. రంగంలోకి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్!

అసలు విషయం ఏమిటంటే తాజాగా శోభిత ధూళిపాళ వెకేషన్ కి వెళ్ళింది. మహారాష్ట్రలోని నాగపూర్ దగ్గర్లో ఉన్న తిపేశ్వర్ అనే ఒక వైల్డ్ లైఫ్ శాంచరీకి వెళ్లినా ఆమె ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కొంచెం అటు ఇటుగా అదే సమయానికి నాగచైతన్య కూడా ఆమె షేర్ చేసిన ఫోటోలలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ కలిసి వచ్చేలా ఒక ఫోటో షేర్ చేశాడు. పూర్తిగా ఒకటే బ్యాక్ గ్రౌండ్ అనలేము కానీ కాస్త దగ్గరి పోలికలు ఉన్నాయి. దీంతో వీరిద్దరూ కలిసే వెకేషన్ కి వెళ్ళారని అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. నిజానికి వీరిద్దరి రిలేషన్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నా అటు నాగచైతన్య గాని ఇటు శోభిత గాని ఎప్పుడూ నేరుగా స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ ప్రచారం గురించి కూడా స్పందిస్తారు అనుకోలేదు.

Show comments