Site icon NTV Telugu

Chaurya Paatam: త్రినాధ రావు న‌క్కిన నిర్మాతగా మొదటి సినిమా.. కార్తీక్ ఘట్టమనేని కథతోనే 

Chaurya Paatham Movie

Chaurya Paatham Movie

Chaurya Paatam First Look & Teaser Unveiled: ధమాకాతో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇప్పుడు నిర్మాతగా మారారు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్‌పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్ కథానాయకుడిగా ఒక సినిమా లాంచ్ అయింది. క్రైమ్ కామెడీ డ్రామాగా ‘చౌర్య పాఠం’తో అనే పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ని విడుదల చేసి ప్రచార కార్యక్రమాలను మేకర్స్ శనివారం నాడు ప్రారంభించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉండగా, టీజర్ అలరించే విధంగా ఉంది. హీరో ఊరిలో దోపిడీకి తన ముఠాను సిద్ధం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అతను ఈ దోపిడీ మిషన్‌లోని 4 ముఖ్యమైన విషయాలను వారికి చెబుతాడు.

Bhoothaddam Bhaskar Narayana: నరబలి నేపథ్యంలో భూతద్దం భాస్కర్ నారాయణ.. రాక్షసులే దిగారా ఏంటి?

అదేమంటే 1. వారు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ అని గ్రామస్తులను నమ్మించేలా చేయాలి. 2. వాకీ-టాకీ మాత్రమే కమ్యూనికేషన్ వ్యవస్థగా ఉండాలి. 3. కోడ్ భాషలో మాత్రమే మాట్లాడాలి. 4. వారి దాచిన ఆయుధాలు వారికి మాత్రమే కనిపించాలి. ఇక ఈ ముఖ్యమైన విషయాలను బేస్ చేసుకుని వారు తమ మిషన్‌ను ఎలా అమలు చేస్తారు అనేది కథ యొక్క ముఖ్యాంశం. ఇక సినిమాటోగ్రాఫర్, ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి ఆసక్తికరమైన కథను అందించగా, నిఖిల్ గొల్లమారి వినోదభరితంగా రూపొందించారని తెలుస్తోంది. స్టైలిష్‌గా కనిపించే ఇంద్ర రామ్ తన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడని అంటున్నారు. పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటించగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్ పరిశీలిస్తే కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం ఎప్పటిలాగే అసాధారణంగా ఉంది, అయితే ఈగిల్ ఫేమ్ డేవ్‌జాండ్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఫన్ టచ్ ఇచ్చారు. ఇక త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Exit mobile version