NTV Telugu Site icon

Chadalawada: హీరో-డైరెక్టర్లు నిర్మాతలకు విలువ ఇవ్వడం లేదు.. చదలవాడ షాకింగ్ కామెంట్స్

Chadalawada Srinivasa Rao

Chadalawada Srinivasa Rao

Chadalawada Srinivasa Rao Sensational Commnents: హీరో-డైరెక్టర్లు నిర్మాతలకు విలువ ఇవ్వడం లేదు.. చదలవాడ షాకింగ్ కామెంట్స్శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ మీద అనేక సినిమాలు నిర్మించి అడవి దొర, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు చదలవాడ శ్రీనివాసరావు. ఆయన తాజాగా రికార్డు బ్రేక్ అనే ఒక సినిమా తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనే కాకుండా ఒడిశా, భోజపురి భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గతంలో కంటే ఇప్పుడు హిట్ సినిమాలు ఎక్కువగా లేక పోవడానికి గల కారణాలు వివరించారు. ఒకప్పుడు సినిమా దర్శకుడు, నిర్మాత మధ్య బంధం భార్య భర్తల బంధంలాగా ఉండేదని కానీ ఇప్పుడు డైరెక్టర్ హీరో ఒకటే అయి నిర్మాతలకు విలువ ఇవ్వడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

Nivetha Pethuraj: సీఎం కొడుకు నాకేం ఇవ్వలేదు.. నా జీవితం నాశనం చేయకండి

సినిమాల సక్సెస్ రేట్ తగ్గిపోవడానికి అది మెయిన్ రీజన్ అని ఆయన అన్నారు. ఇక మీ సంస్థ నుంచి పెద్ద హీరోలతో చేసే భారీ బడ్జెట్ సినిమాలో ఆశించవచ్చా అని అడిగితే తాను బతికుండగా పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. తాను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద సినిమా హీరోలతో సినిమాలు చేయకపోవడమేనని అన్నారు. తాను కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి తనలాగే కష్టపడుతున్న వారిని పైకి తీసుకురావాలని తనకు ఉంటుందని అన్నారు. మరి గతంలో మీరు సినిమాలు చేసిన శోభన్ బాబు, నాగేశ్వరరావు వంటి వారు పెద్ద హీరోలే కదా అని అడిగితే వాళ్ళు మనుషులని ఆయన అన్నారు. వారు మానవత్వం ఉన్న వాళ్ళని షూటింగ్ కి వెళ్లినా వెళ్ళకపోయినా వాళ్లు నాకన్నా ముందు వచ్చి షూటింగ్ చేసేవారని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఆయన చెప్పకొచ్చారు.