Site icon NTV Telugu

Chaari 111: మా చారి 111 చాలా కూల్.. ఎక్కడా తగ్గేది లేదు!

Chaari 111 Pressmeet

Chaari 111 Pressmeet

Chaari 111 Pre Release Press Meet: ‘వెన్నెల’ కిషోర్ హీరోగా నటించిన సినిమా ‘చారి 111’ మార్చి 1న థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ‘మళ్ళీ మొదలైంది’ ఫేమ్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించిన ఈ సినిమాలో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా, మురళీ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. సినిమా రిలీజ్ సంధర్భంగా సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర బృందం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఇక ఈ క్రమ్మలో దర్శకుడు కీర్తీ కుమార్ మాట్లాడుతూ నేను తెలుగు వాడినైనా బెంగళూరులో పదేళ్లు యాడ్ ఫిలిమ్స్ చేసి సినిమాల్లోకి వచ్చా. ‘చారి 111’కి ముందు ‘మళ్ళీ మొదలైంది’ సినిమా చేశా, అందులో వెన్నెల కిశోర్ కమెడియన్ రోల్ చేశారు. ఆయనకు అప్పుడే ఈ సినిమా కథ చెప్పా, ఆయనకు నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాం. ఆయన ఫెంటాస్టిక్ కమెడియన్. ఆయనకు ఫ్యాన్ నేను. ఆయనకు టైలర్ మేడ్ క్యారెక్టర్ చారి. ఇదొక స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్. కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది.

Malaikottai Vaaliban Review: మలైకోటై వాలిబన్‌ రివ్యూ

మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కె కింగ్, నేను బీటెక్ బ్యాచ్‌మేట్స్, కాలేజీలో చదుకోవడం తప్ప కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చేశాం. మంచి మ్యూజిక్, రీ రికార్డింగ్ ఇచ్చాడు. సంయుక్తా విశ్వనాథన్ యాక్షన్ కూడా చేసింది. లాస్ట్ బట్ నా లీస్ట్… మా నిర్మాత అదితి ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేస్తారు. కంటెంట్ రిచ్ సినిమాలు తీయాలని వచ్చారు. ముందు మే నెలలో సినిమా విడుదల చేయాలని అనుకున్నా, నెల రోజుల ముందు మార్చి 1కి షిఫ్ట్ చేశాం అని అన్నారు. ఇక హీరోయిన్ సంయుక్తా విశ్వనాథన్ మాట్లాడుతూ మా ‘చారి 111’ వెరీ కూల్ ఫిల్మ్, వెన్నెల కిశోర్ బ్రిలియంట్ యాక్టర్. ఫెంటాస్టిక్ కమెడియన్. మురళీ శర్మ , బ్రహ్మాజీ , రాహుల్ రవీంద్రన్ , తాగుబోతు రమేష్ , సత్య ఇలా చాల మంది మంచి నటులతో పని చేసే అవకాశం లభించింది. మా సినిమాలో ఒక్కటే పాట ఉంది. దానికి రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. సంజిత భట్టాచార్య అద్భుతంగా పాడింది. ‘చారి 111’లో నేను స్టంట్స్ చేశారు. మా స్టంట్ మాస్టర్ కరుణాకరణ్ , నాకు ట్రైనింగ్ ఇచ్చిన రాముకి థాంక్స్. నెక్స్ట్ ప్రెస్‌మీట్‌లో తెలుగులో మాట్లాడతా, ప్రేక్షకులు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను, నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పారు.

Exit mobile version