NTV Telugu Site icon

Captain Miller: మన సినిమాలకే థియేటర్లు లేవంటే.. ధనుష్ కూడా సంక్రాంతికే!

Sundeep In Captain Miller

Sundeep In Captain Miller

Captain Miller to release in Sankranthi Season Amid Huge Rush: నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ కాగా తాజాగా ‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ పాటని కూడా విడుదల చేసి మేకర్స్ గ్రాండ్ గా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఆ తరువాత ఈరోజు మరో సాంగ్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. క్రీ నీడే అంటూ సాగుతున్న ఈ సాంగ్ కి స్టార్ కంపోజర్ జివి ప్రకాష్ ఈ పాట కోసం పవర్ ప్యాక్డ్ నెంబర్ ని స్కోర్ చేయగా రాకేందుమౌళి రాసిన లిరిక్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. సింగర్ జావేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ తో పాటు పాటలో చూపించిన విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి.1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యుజ్ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ పీరియడ్ ఫిల్మ్ లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగా నటిస్తోంది.

Mangalavaaram : మంగళవారం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!

టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు. ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ సినిమాకి సిద్ధార్థ నుని డీవోపీ గా పని చేస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ సినిమా తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తుండగా ‘2024 సంక్రాంతికి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుందని అధికారిక ప్రకటన వచ్చింది. అయితే మిగతా బాషల సంగతి ఎలా ఉన్నా తెలుగులో ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే థియేటర్లు అసలు దొరుకుతాయా? అనే అనుమానం కలుగక మానదు. ఎందుకంటే ఈ తెలుగులో ఇప్పటీకే హనుమాన్, గుంటూరు కారం, ఈగల్, సైన్ధవ్ సినిమాలతో పాటు నా సామి రంగా కూడా రిలీజ్ అవుతొంది. ఇప్పటికే థియేటర్లు దొరక్క నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ధనుష్ సినిమాను ఏమి చేస్తారో చూడాలి.