టాలీవుడ్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని ప్రముఖ శీతల పానీయ బ్రాండ్ “కాంపా”కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సినిమా రంగంలో తన అద్భుతమైన నటనతో గుండెలు గెలుచుకున్న రామ్ చరణ్, ఇప్పుడు కాంపా బ్రాండ్‌తో జతకట్టి మరోసారి తన బహుముఖ ప్రతిభను చాటుకోనున్నారు. కాంపా ఒక దశాబ్దాల చరిత్ర కలిగిన శీతల పానీయ బ్రాండ్, . రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెట్టిన తర్వాత, కాంపా మళ్లీ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడం ద్వారా, కాంపా తమ ఉత్పత్తిని దేశవ్యాప్తంగా ఉన్న యువతకు మరింత చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్ చరణ్ తనదైన శైలితో కనిపించనున్నారు. సినిమా రంగంలో రామ్ చరణ్ ఇప్పటికే తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. సినిమాలతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌లో కూడా ఆయన రాణిస్తున్నారు. కాంపా లాంటి బ్రాండ్‌తో జతకట్టడం ద్వారా, రామ్ చరణ్ తన వాణిజ్య ప్రభావాన్ని మరింత విస్తరిస్తున్నారు. రామ్ చరణ్ కాంపా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.