NTV Telugu Site icon

Butta Bomma: ఆకట్టుకుంటున్న ‘బుట్ట బొమ్మ’ తొలి పాట

Butta Bomma First Song

Butta Bomma First Song

Butta Bomma First Song Peruleni Ooruloki Released: అనిక సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ నటిస్తున్న ‘బుట్ట బొమ్మ’ చిత్రం నుండి మొదటి పాట ‘పేరు లేని ఊరులోకి’ విడుదలైంది. స్వీకర్ అగస్తి స్వరపరిచిన ఈ పాటను సనాపతి భరద్వాజ్ పాత్రుడు రచించగా, మోహన భోగరాజు ఆలపించారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ఫీల్ గుడ్ రూరల్ డ్రామాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

మొబైల్ టాక్స్ ద్వారా ప్రధాన పాత్రధారులు క్రమంగా ఒకరితో ఒకరు ప్రేమలో పడే అందమైన ప్రపంచాన్ని ఈ పాట పరిచయం చేస్తుంది. పాటలోని ప్రశాంతమైన పరిసరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచి అవి మనల్ని పాత్రల ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాయి. ‘అంకె మారి లంకె వేసే కొత్త సంఖ్య వచ్చిందా… నవ్వులన్నీ మూటగట్టి మోసుకొస్తూ ఉందా’, ‘అలుపు సలుపు అణువంత కూడా తల దాచుకోని చురుకంతా… తన వెంటపడుతూ నిమిషాలు మెల్లగా కరిగే ప్రతి పూట’ అంటూ సనాపతి భరద్వాజ్ పాత్రుడు అందించిన సాహిత్యం పాట సందర్భానికి తగ్గట్లుగా అర్థవంతంగా, ఆకట్టుకునేలా సాగింది. ‘ఈ పాట రాయడానికి దర్శకులు రమేష్ నన్ను నాకంటే ఎక్కువ నమ్మడమే. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు నా ధ్యన్యవాదాలు. స్వీకర్ అగస్తి ట్యూన్స్ నేచురల్ గానే కాదు క్యాచీగా ఉన్నాయి.

రెండోసారి ఆయనతో కలిసి పని చెయ్యడం ఆనందంగా ఉంది. మోహనా భోగరాజు దీనిని చాలా చక్కగా పాడారు‘ అని అంటున్నారు గీత రచయిత సనాపతి భరద్వాజ్. నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి, మిర్చి కిరణ్, కంచరపాలెం కిషోర్, మధుమణి ఇందులోని ఇతర ముఖ్య పాత్రధారులు. జనవరి 26న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్.నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ‘వరుడు కావలెను’తో గుర్తింపు తెచ్చుకున్న రచయిత గణేష్ కుమార్ రావూరి సంభాషణలు అందించారు.