NTV Telugu Site icon

Kalki 2898AD: కల్కి టీం లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్..

Kalki

Kalki

పాన్ ఇండియా స్టార్,రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ఫ్యాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అమితాబ్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. తాజాగా కల్కి టీమ్ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది..

ఈ సినిమాను డిఫరెంట్ కథతో తెరకెక్కిస్తున్నారు..సైన్స్, పురాణాలు కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ సినిమా గురించి వివరిస్తూ ఊరిస్తున్నాడు.. దాంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ హంగామా మొదలైంది..

ఈ సినిమా జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో మేకర్స్ అదిరిపోయే ప్రకటనను అనౌన్స్ చేశారు.. గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, కంటెంట్ క్రియేటర్‌లు, మార్కెటింగ్ ఔత్సాహికులు, ఆసక్తి కలిగిన వారు కల్కి టీం లో చేరవచ్చు అంటూ ఓ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ప్రభాస్ సినిమా అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువే.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..