NTV Telugu Site icon

Brahmanandam: కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్‌ను కలిసిన బ్రహ్మానందం.. ఎందుకంటే?

Brahmi

Brahmi

Brahmanandam meets CM KCR in Pragati Bhavan: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‏ను టాలీవుడ్ టాప్ కమెడియన్, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో జరుగనున్న తన చిన్న కుమారుడి వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దంపతులను కుటుంబ సమేతంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు బ్రహ్మానందం. ఈ క్రమంలో తాను స్వయంగా స్వహస్తాలతో కుంచె పట్టి గీసిన తిరుమల శ్రీవారి డ్రాయింగ్ ను బహుమతిగా అందించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ బ్రహ్మానందం కుటుంబంతో కాసేపు సీఎం ముచ్చటించి పెళ్లి విషయాలు అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మానందంతో పాటు ఆయన సతీమణి, పెద్ద కొడుకు గౌతమ్ ప్రగతి భవన్‏లో సీఎం దంపతులను కలుసుకున్నారు.

Dil raju: అందుకే గిల్డ్ పెట్టాము.. ఇష్టం లేదు కానీ బరిలోకి దిగా!

బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం మే 21న ఐశ్వర్య అనే అమ్మాయితో జరగగా సినీ, రాజకీయ ప్రముఖులు హజరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక బ్రహ్మానందం సినిమాల విషయానికి వస్తే వయోభారం రీత్యా ఆయన చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. చివరిగా ఆయన బ్రో అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. నిజానికి అక్కడ పాత్రకి స్కోప్ లేదు కానీ త్రివిక్రమ్ కాంబో కోసం ఆయనను నటింప చేసినట్లు అనిపించింది. ఇక కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించారు. సాధారణంగా కామెడీ పాత్రలకు పరిమితం అయ్యే ఆయన ఈ సినిమాలో మాత్రం కన్నీళ్లు తెప్పించే పాత్రలో నటించారు.