Bollywood – Hollywood: The release of those two movies!
సినిమాల విడుదల తేదీని చాలా ఎర్లీ గా ప్రకటించడం హాలీవుడ్ లో జరుగుతూ ఉంటుంది. బాలీవుడ్ లోనూ స్టార్స్ మూవీస్ క్లాష్ కాకుండా దర్శక నిర్మాతలు సినిమా విడుదల తేదీలను ముందుగానే ప్రకటించడం గత కొంతకాలంగా చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా రిలీజ్ డేట్స్ విపరీతంగా వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడిప్పుడే అన్ని సినిమా రంగాలు కుదుట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్వెల్ స్టూడియోస్ కు చెందిన ‘బ్లాక్ పాంథర్’ మూవీని నవంబర్ 11న విడుదల చేయబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సినిమా కేవలం ఇంగ్లీష్ లోనే కాకుండా ఆ తేదీన ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమంటే… అదే తేదీన తమ హిందీ చిత్రం ‘ఊంచాయి’ని విడుదల చేయబోతున్నట్టు సోమవారం దర్శక నిర్మాత సూరజ్ బర్జాత్యా తెలిపారు. సుప్రసిద్థ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సూరజ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ లో అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ, అనుపమ్ ఖేర్, సారిక, నీనాగుప్తా తో పాటు పరిణితీ చోప్రా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మరి నవంబర్ 11న మరి ఇంకే చిత్రాలు విడుదలకు సిద్ధమౌతాయో చూడాలి.
