NTV Telugu Site icon

Black Adam: ఒటీటీలో చూసిన తర్వాత అయిన ఈ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తారా?

Black Adam

Black Adam

‘డ్వేన్ డగ్లస్ జాన్సన్’ అనే పేరు పెద్దగా తెలియక పోవచ్చు కానీ ‘ది రాక్’ అనే పేరు మాత్రం ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ‘రాక్’గా వ్రెస్లింగ్ అభిమానులని అలరించిన ‘డ్వేన్ జాన్సన్’ ఇటివలే నటించిన సినిమా ‘బ్లాక్ ఆడమ్’. DC కామిక్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సూపర్ హీరో సినిమా అక్టోబర్ 3న ఆడియన్స్ ముందుకి వచ్చింది. 260 మిలియన్ డాలర్స్ తో రూపొందిన ‘బ్లాక్ ఆడమ్’ సినిమా ఓవరాల్ గా 400 మిలియన్ డాలర్స్ కూడా రాబట్టలేక పోవడంతో, ఈ మూవీని ఫ్లాప్ సినిమాల లిస్టులో వేశారు. కథ పరంగా, మేకింగ్ పరంగా కొత్తదనం కూడా లేకపోవడంతో ‘బ్లాక్ ఆడమ్’ సినిమా DC కామిక్స్ నుంచి వచ్చిన వీకెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆశించిన స్థాయిలో రిజల్ట్ లేకపోవడంతో DC కామిక్స్ నుంచి ‘బ్లాక్ ఆడమ్’ సీరీస్ లో మరో సినిమా వచ్చే అవకాశం లేదు.

ఈ విషయాన్ని ‘డ్వేన్ జాన్సన్’ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ గతంలో ఒక ట్వీట్ కూడా చేశాడు. సూపర్ హీరో సినిమాలు అంటే ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకోని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. అలాంటిది ఒక్క సినిమా నిరాశపరచగానే ‘బ్లాక్ ఆడమ్’ క్యారెక్టర్ ని ఎందుకు ఎండ్ చేశారు అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఈ మూవీ ఎట్టకేలకు ఒటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో ‘బ్లాక్ ఆడమ్’ స్ట్రీమ్ అవుతోంది, మరి ఒటీటీలో వచ్చే రీచ్ చూసి అయినా బ్లాక్ ఆడమ్ క్యారెక్టర్ ని కంటిన్యు చేస్తాడేమో.