NTV Telugu Site icon

Bindu Madhavi: అవును, ఆ స్టార్ హీరోయిన్ ప్రియుడ్ని ప్రేమించా.. బిందు మాధవి బాంబ్

Bindu Madhavi Varun

Bindu Madhavi Varun

Bindu Madhavi Gives Clarity On Love Affair With Varun Manian: దక్షిణాది స్టార్ నటి త్రిష కొన్ని సంవత్సరాల క్రితం వరుణ్ మణియన్ అనే ఓ వ్యాపారవేత్తను ప్రేమించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అతనితో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపించిన ఆ బ్యూటీ.. అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక త్వరలోనే పెళ్లి ఉంటుందని అనుకుంటుండగా.. అనూహ్యంగా వాళ్లిద్దరు విడిపోయారు. తమ పెళ్లిని రద్దు చేసుకొని.. ఎవరు పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. అయితే.. వరుణ్ మణియన్ ఆ వెంటనే మరోసారి వార్తల్లోకెక్కాడు. తెలుగు నటి బిందు మాధవితో అతడు ప్రేమలో పడ్డాడని ప్రచారం జరిగింది. వాళ్లిద్దరు కలిసి వెకేషన్స్‌కి, పార్టీలకు వెళ్లడం.. ఆయా ఫోటోలు బయటకు లీక్ అవ్వడంతో.. వారి మధ్య పప్పులు ఉడుకుతున్నాయన్న వార్తలకు మరింత బలం చేకూరింది. పెళ్లి కూడా చేసుకుంటారన్న ప్రచారమూ జరిగింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. వీరి ప్రేమ కూడా పెళ్లి వరకు రాకుండానే ఆగిపోయింది.

Jawan Movie: జవాన్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

అయితే.. బిందు మాధవి ఏనాడు కూడా వరుణ్ మణియన్‌తో కొనసాగించిన తమ ప్రేమ వ్యవహారంపై నోరు విప్పలేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆమె తన ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన న్యూసెన్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బిందుకి వరుణ్‌తో సాగించిన ప్రేమ తతంగంపై ఒక సూటి ప్రశ్న ఎదురైంది. ‘త్రిష ప్రియుడ్ని మీరు ప్రేమించారా?’ అని ఓ జర్నలిస్ట్ ముఖం మీదే అడిగేసింది. ఆ ప్రశ్న విని క్షణంపాటు ఆలోచనలో పడిపోయిన బిందు మాధవి.. ఆ తర్వాత అందులో కొంత నిజం, కొంత అబద్ధమని ఉందని సమాధానం ఇచ్చింది. తాను త్రిష ప్రియుడ్ని ప్రేమించిన మాట వాస్తవమేనని క్లారిటీ ఇచ్చింది. అయితే.. తాను, త్రిష ఒకేసారి వరుణ్‌ని ప్రేమించలేదని.. వాళ్లిద్దరు విడిపోయాకే తాను వరుణ్‌కి దగ్గర అయ్యానని తెలిపింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. వీరి బ్రేకప్‌కి గల కారణాలేంటో మాత్రం బిందు రివీల్ చేయలేదు. బహుశా అభిరుచులు కలవకపోవడం వల్ల వీళ్లు విడిపోయి ఉండొచ్చు.

Krithi Setty: ‘కస్టడీ’ కోసం కష్టపడి జిమ్నాస్టిక్స్!