Bigg Boss Telugu OTT Season 2 details: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈరోజు గ్రాండ్ ఫినాలేకి సిద్ధమైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు రెండవ OTT సీజన్ వేదికపై ప్రకటించబడుతుందని తెలుస్తోంది. OTTలో రెండవ సీజన్ గురించి తెలుసుకోవడానికి బిగ్ బాస్ ఫాలోవర్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం మేరకు నాగార్జున OTT సీజన్‌కు యాంకరింగ్ చేయడం లేదు. రాబోయే సీజన్లలో తాను భాగం కాబోనని నాగార్జున BB యాజమాన్యానికి తెలియజేసినట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ తెలుగు OTT రెండవ సీజన్‌కు హీరో శ్రీకాంత్ యాంకర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. బిగ్ బాస్ తెలుగు OTT సీజన్ 2 కోసం ఇప్పటికే శ్రీకాంత్‌తో బిగ్ బాస్ టీమ్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతానికి అధికారికం అయితే కాదు. బిగ్ బాస్ తెలుగు మొదటి OTT సీజన్ 2022లో 24×7 నాన్‌స్టాప్ స్ట్రీమింగ్‌తో జరిగింది. ఈ సీజన్‌లో నటి బిందు మాధవి విజేతగా నిలిచింది. బిగ్ బాస్ తెలుగు మొదటి OTT సీజన్ గేమ్ షోలో కొత్త, పాత కంటెస్టెంట్లు కొంతమంది పాల్గొన్నారు.
Salaar: హిట్ అవ్వాలంటే 800 కోట్లు కొట్టాల్సిందే.. ఎక్కడెక్కడ ఎంతకు అమ్మారో తెలుసా?
అరియానా గ్లోరీ, తేజస్వి మడివాడ, కొరియోగ్రాఫర్ నటరాజ్, నటి ముమైత్ ఖాన్ బిగ్ బాస్ తెలుగు OTT సీజన్ 1 పోటీలో ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సీజన్ 7 ఫైనల్ స్టేజ్‌లో సెకండ్ OTT సీజన్ గురించి ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సారి యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయిన వారిలో కొంతమంది పార్టిసిపెంట్స్ ఎంపిక అవుతున్నారు. వీరిలో కొందరిని జబర్దస్త్ షో నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక హాట్‌స్టార్‌లో ఈ సీజన్ హిట్ అయితే బిగ్ బాస్ సీజన్ 8కి విపరీతమైన క్రేజ్ వచ్చే అవకాశం ఉందని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తోంది. మరోవైపు, బిగ్ బాస్ కూడా OTTలో స్పాన్సర్‌ల కోసం వెతుకుతున్నారు. గతంలో, OTT సీజన్‌కు అస్సలు స్పాన్సర్‌లు రాలేదు. దీంతో నిర్వాహకులే అన్నీ భరించారు. అంతేకాకుండా, మొదటి OTT సీజన్ 24 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం చేయడంతో రేటింగ్‌లు తక్కువగా వచ్చాయి. ఈసారి సీజన్ 1లో జరిగిన పొరపాట్లను అధిగమించి సీజన్ 2ను విజయవంతం చేయాలని యాజమాన్యం చూస్తున్నట్లు కనిపిస్తోంది.