Site icon NTV Telugu

Lucky Laxman: ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ & ఎమోష‌న్స్ కాంబోతో అలరించనున్న ల‌క్కీ ల‌క్ష్మణ్‌

Lucky Lakshman Movie

Lucky Lakshman Movie

Bigg Boss Fame Sohel Movie Lucky Lakshman Releasing On Dec 30: బిగ్ బాస్ ఫేమ్ స‌య్యద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న లేటెస్ట్ సినిమా ‘లక్కీ లక్ష్మణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై హరిత గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమాని ఏఆర్ అభి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 30వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. చిత్రబృందం శనివారం ట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే.. డైరెక్టర్ అభి ఈ చిత్రాన్ని ఎంట‌ర్‌టైనింగ్‌గా మ‌లిచిన‌ట్లు స్పష్టమవుతోంది. లైఫ్‌లో డ‌బ్బులు సంపాదించాల‌నుకునే ఓ యువ‌కుడు.. కోటీశ్వరుల కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిలైపోతుంద‌ని భావించి, అమ్మాయిల వెంటపడటం మొదలుపెడతాడు. చివ‌ర‌కు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. నిజంగా ఆ అమ్మాయి డ‌బ్బున్న అమ్మాయేనా? ప్రేమించాలంటే డ‌బ్బులు మాత్రమే ఉండాలా? అనే ఓ పాయింట్‌పై ద‌ర్శకుడు ‘ల‌క్కీ ల‌క్ష్మణ్‌’ను ఎంత ఆస‌క్తిక‌రంగా తెరెక్కించాడ‌నేది తెలియాలంటే.. డిసెంబర్ 30వ తేదీన సినిమాను చూడాల్సిందే! ట్రైలర్‌ని చూస్తుంటే.. ఈ సినిమా చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా, ఎమోష‌న‌ల్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇక సోహైల్ న‌ట‌న ట్రైల‌ర్‌లో సింప్లీ సూప‌ర్బ్‌. ఇక సినిమా ఆసాంతం త‌ను ఎలా నవ్విస్తాడో చూడాలి.

తమ సినిమి గురించి నిర్మాత హ‌రిత గోగినేని మాట్లాడుతూ.. ‘‘త‌ల్లిదండ్రుల ప్రేమానురాగాలు.. అమ్మాయి ప్రేమ … ఏదీ త‌క్కువ కాదు. అలాంటి వాటి కంటే డ‌బ్బు గొప్పదా అనే పాయింట్‌ను మా ద‌ర్శకుడు అభి ‘ల‌క్కీ ల‌క్ష్మణ్’ సినిమా రూపంలో అందంగా తెర‌కెక్కించారు. హీరో సోహైల్ త‌న‌దైన న‌ట‌న‌తో అద్భతుంగా న‌టించారు. డిసెంబ‌ర్ 30న సినిమా చూస్తే మీరే చెబుతారు. మేం కూడా చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం. మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నామని నమ్మకంగా ఉన్నాం’’ అని అన్నారు. ఇక హీరో సోహైల్ మాట్లాడుతూ.. ‘‘రీసెంట్‌గా రిలీజైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌కు కూడా దానికి మించి రెస్పాన్స్ వస్తోంది. నేను ప‌డ్డ క‌ష్టానికి డిసెంబ‌ర్ 30న రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను. ల‌క్కీ ల‌క్ష్మణ్ అంద‌రినీ మెప్పించే సినిమా అవుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక దర్శకుడు అభి మాట్లాడుతూ.. ‘టీజర్ చూసి అప్రిషియేట్ చేసిన ఆడియెన్స్ నుంచి ట్రైలర్‌కి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ల‌క్కీ ల‌క్ష్మణ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో న‌వ్విస్తాడు. మిమ్మల్ని ప్రేమ‌లో ప‌డేస్తాడు. ఎమోష‌నల్‌గా మీ హృద‌యాల‌కు ద‌గ్గర‌వుతాడు. సోహైల్ ఈ సినిమాతో మంచి హీరోగా ప్రూవ్ చేసుకుంటాడు’’ అని అన్నాడు.

Exit mobile version