Bigg Boss Telugu: వచ్చేసింది.. వచ్చేసింది.. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది. కుటుంబంతా కూర్చొని ఎంజాయ్ చేసే ఈ షో ఇటీవలే సీజన్ 5 ను విజయవంతంగా పూర్తిచేసుకున్న విషయం విదితమే. ఇక ఎప్పుడెప్పుడు సీజన్ 6 వస్తుందా..? అని బిగ్ బాస్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఎదురుచూపులకు స్వస్తిపలికి తాజాగా ఈ షో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసారి కూడా ఈ షో కు నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకొంటుంది. పెళ్లి తరువాత జరిగే అప్పగింతలలలో పెళ్లి కూతురు తో పాటు కుటుంబం అంత కన్నీరు పెడుతూ ఉంటారు. అదే సమయంలో బిగ్ బాస్ సౌండ్ వినిపించగానే అందరూ పెళ్లి కూతురును వదిలేసి టీవీ ముందు ప్రత్యక్షమవుతారు.
ఇక చివర్లో నాగార్జున నవ్వుతూ ఎంట్రీ ఇచ్చి లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే అని చెప్పుకొస్తూ బిగ్ బాస్ త్వరలో వచ్చేస్తోంది అని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్ టైమెంట్ కు అడ్డా ఫిక్స్ అంటూ నాగ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సీజన్ లో పేరున్న ప్రముఖులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. నాగ్ కూడా ఈసారి సీజన్ ను మరింత రసవత్తరంగా ఉండేలా ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇంకా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించకపోవడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో అని కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మరికొందరు అబ్బా.. మళ్లీ న్యూసెన్స్ మొదలయ్యింది అంటూ తలలు కొట్టుకొంటున్నారు.
https://youtu.be/_tUTBIZ3X1o
