Site icon NTV Telugu

Bhagyashri Borse : సాహసం శ్వాసగా సాగిపో

Bagya Sri

Bagya Sri

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ స్పాన్ టైమ్ చాల తక్కువ, 4-5 ఏళ్లు దాటితే ఆడియన్స్ కు బోర్ కొడుతుంది. అందుకే హీరోల కంటే హీరోయిన్లే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. అలా ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హవా ఇప్పుడు నడుస్తోంది. మహారాజ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తోందీ ముద్దుగుమ్మ.

Also Read : Tollywood : డబ్బింగ్ సినిమాల రైట్స్ కోసం తెలుగు నిర్మాతల తహతహ

తన అందం, నటనతో యూత్‌ను ఆకర్షిస్తూ కొత్త స్టార్ హీరోయిన్‌గా స్థిరపడుతోంది. సోషల్ మీడియాలో భాగ్యశ్రీ బోర్సే యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో తన విశేషాలను పంచుకుంటు ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లేటెస్ట్ పిక్స్, వీడియోలను షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె తన ట్రావెల్ అనుభవాలు, మోడలింగ్ షూట్స్, సినిమా అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా దుబాయ్ ట్రిప్‌లో స్కై డైవ్ వీడియోను పంచుకుంది. విమానం నుంచి కిలోమీటర్ల ఎత్తు నుంచి దూకి, ఆకాశంలో విహరించిన ఈ సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి రిస్కీ స్టంట్‌లు చేయడానికి ఎంతో ధైర్యం, తెగువ కావాలి. భాగ్యశ్రీ ఈ సాహసాన్ని సేఫ్‌గా పూర్తి చేసి కిందకి దిగింది. ఈ స్కై డైవ్ వీడియోను భాగ్యశ్రీ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది. “ఒకటే లైఫ్, ఒకటే శ్వాస, ఒకటే జంప్” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసింది. భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది.

Exit mobile version