Site icon NTV Telugu

Bhaag Saale : ఉర్రూతలూగించే ‘కూత రాంప్’ పాట విడుదల

Kootha Ramp

Kootha Ramp

నేటి తరం యువత ని ఆకట్టుకునే సరికొత్త కథతో కొత్త దర్శకుడు ప్రణీత్ సాయి నేతృత్వంలో యువ నటుడు శ్రీ సింహా హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భాగ్ సాలే’. ఫస్ట్ లుక్ నుండే ఈ చిత్రం పై ఆసక్తి పెంచుతూ ఈరోజు విడుదల చేసిన ‘కూత రాంప్’ పాట యువత కి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ ఉర్రూతలూగించేలా సంగీతం అందించి తనే పాడిన ఈ పాటకి కె.కె అందించిన లిరిక్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. కాగా, లిరికల్ వీడియో లో హీరో వేసిన హుక్ స్టెప్ చాలా కొత్తగా ఉంది.
వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ విజయ్ మరియి నందిని రాయ్ ప్రతినాయక పాత్రలు చేస్తున్నారు.

ఆద్యంతం థ్రిల్ చేసే ఈ కథలో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.

Exit mobile version