Bellamkonda Sai Sreenivas BSS11 Announced On Sri Rama Navami: తన 10వ సినిమాతో బిజీగా ఉన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు మరో ప్రాజెక్ట్ ప్రకటించాడు. మంచి భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన డైనమిక్ నిర్మాత సాహు గారపాటి, కౌశిక్ పెగళ్లపాటి రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. పోస్టర్ లో డిటైలింగ్ చూస్తే ఒక అద్భుతమైన భయంకరమైన కథగా ఈ సినిమా అనిపిస్తుంది. శ్రీరాముడు తన చేతిలో విల్లుతో బాణాన్ని ఆకాశం లో ఉన్న రాక్షసుడికి ఎక్కుపెట్టడం, ఈ శ్రీరామనవమి సందర్భానికి సరిగ్గా సరిపోయింది.
Sundarakanda: ఈ సారి ‘సుందరకాండ’తో నారా రోహిత్
మనం పోస్టర్ లో షాడో తోలుబొమ్మలాట ,నిర్జనమైన అడవి, యాంటెన్నా టవర్ మరియు హార్నెట్ కూడా చూడవచ్చు. భగవంత్ కేసరి సంచలన విజయం తర్వాత, షైన్ స్క్రీన్స్ ఈ ఒక హారర్ మిస్టరీతో వెండితెరపైకి మరల మరపురాని సినిమాటిక్ అనుభూతిని అందజేస్తుందని హామీ ఇచ్చింది. ఈ సినిమాకి చిన్మయ్ సలాస్కర్ కెమెరా క్రాంక్ చేయనుండగా, కాంతారా ఫేమ్ బి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్. నిరంజన్ దేవరమానే ఈ సినిమాకి ఎడిటర్ గా చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.