Site icon NTV Telugu

చిరు విషయంలో బండ్ల గణేష్ కొత్త డిమాండ్

Bandla Ganesh wants Include Chiranjeevi’s life history in text books

తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతలలో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్ గా లేనప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ తన కొత్త డిమాండ్ తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మాట్లాడటానికి అభిమానులు ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్‌ను నిర్వహించారు. అందులో దర్శకులు, నటీనటులు మరియు నిర్మాతలతో సహా పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సెషన్ లో బండ్ల గణేష్ కూడా ఉన్నాడు. చిరంజీవి గురించి మాట్లాడుతున్నప్పుడు బండ్ల తనదైన శైలిలో మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపించాడు. పొగడ్తలతో చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాదు ఆయన గురించి తన మనసులో ఉన్న ప్రత్యేకమైన కోరికను ఇందులో వ్యక్తం చేశారు.

Read Also : “ఎవరు మీలో కోటీశ్వరులు” అంటూ అదరగొట్టిన ఎన్టీఆర్, చరణ్

“మెగాస్టార్ చిరంజీవి జీవిత కథను పాఠశాల పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో పాఠంగా చేర్చాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను” అంటూ బండ్ల గణేష్ ట్విట్టర్‌ ఇంటరాక్షన్ సెషన్‌లో తన డిమాండ్ ను రిక్వెస్ట్ గా వెల్లడించారు. “వకీల్ సాబ్” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన స్పీచ్ తో వైరల్ అయినా బండ్ల ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి మరోసారి టాక్ టాప్ ది టౌన్ అయ్యాడు. చివరిసారిగా “సరిలేరు నీకెవ్వరు”లో కన్పించిన బండ్ల ఇటీవల విడుదలైన ‘క్రేజీ అంకుల్స్’ మూవీలో నిర్మాత పాత్రనే బండ్ల గణేశ్ పోషించాడు. ఈ కమెడియన్ కమ్ నిర్మాత ఇప్పుడు హీరోగా అవతారం ఎత్తబోతున్నారు. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ చిత్రాన్ని తెలుగులో వెంకట్ చంద్ర దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు స్వాతి చంద్ర.

Exit mobile version