Site icon NTV Telugu

Bandhavi: మసూద పాప మార్నింగ్ స్ట్రెచ్ తో మత్తెకిస్తుందే…

Bandavi Sridhar

Bandavi Sridhar

మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో అందంగా కనిపిస్తూనే, ఆడియన్స్ ని భయపెట్టింది భాంధవి శ్రీధర్. తన డెబ్యు మూవీతోనే ప్రేక్షకులని మెప్పించిన భాంధవి శ్రీధర్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు నుంచే తన ఫొటోలతో ఆకట్టుకునే భాంధవి శ్రీధర్, ఫోటోషూట్ ల పేరుతో ఎప్పుడూ మితిమీరిన స్కిన్ షో చెయ్యలేదు. ట్రెండ్ అండ్ ట్రెడిషనల్ కలగలిపినట్లు ఉండే ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ గా ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “REMINDER- You got only one body, take care of it! Morning Stretch” అనే కొటేషన్ తో ఒక స్ట్రెచింగ్ వీడియోని పోస్ట్ చేసిన బాంధవి శ్రీధర్, వీడియోలో ఎక్సర్సైజ్ చేస్తూ కనిపించింది. కేవలం 23 సెకండ్లు మాత్రమే ఉన్న ఈ వీడియోలో, సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకోని బాంధవి శ్రీధర్ తన బాడీని స్ట్రెచ్ చేస్తూ కనిపించింది. మార్నింగ్ మోటివేషన్ గా బయటకి వచ్చిన ఈ వీడియోని ఫాన్స్ వైరల్ చేస్తున్నారు.   

గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ రెండూ ఉన్నాయి కాబట్టి భాంధవి శ్రీధర్ కి తెలుగులో మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంది. హీరోయిన్ గా డెబ్యు ఇవ్వడం కన్నా ముందు భాంధవి శ్రీధర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. మిస్టర్ పర్ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య, మజ్ను సినిమాల్లో నటించిన భాంధవి శ్రీధర్ కి మసూద సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక్కడి నుంచి కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే తెలుగు నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి హీరోయిన్ దొరికేసినట్లే. మరి స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో, గ్లామర్ షో విషయంలో బాంధవి శ్రీధర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనే దాన్ని బట్టే అమ్మడి కెరీర్ ఆధారపడి ఉంటుంది.

 

Exit mobile version