Balagam Director venu second movie plot leaked: తెలుగులో అనేక సినిమాల్లో కమిడియన్‌గా కనిపించిన వేణు జబర్దస్త్ కామెడీ షో ద్వారా జబర్దస్త్ వేణు అయిపోయాడు. ఇక ఈ మధ్యనే ఆయన దర్శకుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన బలగం సినిమాను తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టేసుకున్నారు. చిన్న సినిమాగా వచ్చిన బలగం చిత్రం బ్లాక్‌బస్టర్ అయి కోట్లు వసూలు చేసి పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే డైరెక్టర్‌గా సత్తాచాటిన వేణు రెండో సినిమాగా ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వేణు ఈమధ్యనే తన రెండో సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
Ramya Pasupuleti: బీచ్ ఒడ్డున సాగర కన్యలా రమ్య పసుపులేటి అందాలు
తాను తీయబోతున్న రెండో సినిమా స్క్రిప్ట్ పనులు సోమవారం నాడు ప్రారంభించానని సోషల్ మీడియాలో తెలిపిన వేణు దానికి సంబంధించి స్క్రిప్ట్ రాస్తున్న పెన్ను, పేపర్ ఫోటోని కూడా షేర్ చేశారు. ఇక బలగం డైరెక్టర్ సెకండ్ స్క్రిప్ట్ తెలంగాణలో మారుమూల గ్రామంలో డప్పు కొట్టుకునే వాడు ఒక కలెక్టర్ వంటి అత్యున్నత స్థానానికి ఎలా వెళ్ళాడు? అనే కథ అని తెలుస్తోంది. ఈమేరకు సోషల్ మీడియాలో లీకులు మొదలయ్యాయి. ఒక పెద్ద స్టార్ హీరోతో తెరకెక్కించాలని దర్శకుడు వేణు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇది నిజమా కాదా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు అద్దం పట్టేలా తీసిన బలగం చిత్రం పెద్ద హిట్ సొంతం చేసుకోగా ఈ రెండో సినిమా ఒక ఇన్స్పిరేషన్ కలిగించేలా ఉంటుందని అంటున్నారు.