Site icon NTV Telugu

Bakasura Restaurant : 250 మిలియన్ల మైలురాయిని చేరుకున్న.. ‘బకాసుర్ రెస్టారెంట్’

Bakasura

Bakasura

ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ తెలుగు ప్రేక్షకులలో పెద్ద క్రేజ్ సంపాదించాయి. వీకెండ్‌ అంటే కొత్త సినిమాలు ఏవి స్ట్రీమింగ్‌లో వచ్చాయో చూడడం అనేది ఒక ఫన్‌ రూటైన్‌లా మారింది. తాజాగా ఈ వారం తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్న మరో ప్రత్యేక సినిమా డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టింది. అదే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చిన ‘బకాసుర్ రెస్టారెంట్’. చిన్న హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ అనుభవాన్ని అందిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఇప్పటివరకు 250 మిలియన్ స్ట్రీమింగ్ మిటిట్స్‌ను దాటింది.

Also Read: Pawan Kalyan : మళ్లీ వార్తల్లో పవన్–సురేందర్‌ రెడ్డి కాంబో.. ఈసారి ప్రాజెక్ట్‌ నిజమవుతుందా?

‘బకాసుర్ రెస్టారెంట్’ హారర్-కామెడీ కాన్సెప్ట్‌తో రూపొందించబడింది. కథలో క్షుద్ర పూజల కారణంగా నిద్రలేని ఆత్మలు, వాటి ప్రభావం వల్ల ఎదురయ్యే ఇబ్బంది కర సంఘటనలు ప్రధానంగా ఉంటాయి. ఈ కథ ప్రత్యేకత.. మూవీలో లీడ్ రోల్‌ పోషిస్తున్న కమెడియన్ ప్రవీణ్ తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. సినిమా హారర్ అంశాలతో పాటు సరదా ఎలిమెంట్స్‌ అందించడం వల్ల, ప్రేక్షకులు మ్యూజిక్, సీన్స్, ఎఫెక్ట్స్‌లను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

Exit mobile version