NTV Telugu Site icon

Dubbing Deepavali: దారుణంగా ఈ వారం సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్

Japan Jigarthanda Double X Movies

Japan Jigarthanda Double X Movies

Bad advance bookings for Japan and Jigarthanda Double X: ఈ వారం నేరుగా పెద్ద తెలుగు సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఇలా నిన్ను చేరి, జనం అనే రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుండగా దీపావళికి రెండు కొంచెం బజ్ ఉన్న తమిళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జపాన్ – జిగర్తాండ డబుల్ X సినిమాలు రేపు అంటే శుక్రవారం నాడు 10వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలకి మంచి బజ్ ఉన్నా తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు బుకింగ్‌ల విషయంలో దారుణంగా రిపోర్టులు కనిపిస్తున్నాయి కార్తీ కెరీర్‌లో జపాన్ ల్యాండ్‌మార్క్ చిత్రం ఎందుకంటే ఆయనకి ఇది 25వ చిత్రం. ఇక జిగర్తాండ డబుల్ ఎక్స్ రాఘవ లారెన్స్, ఎస్‌జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్ చిత్రమే కాకుండా డైరెక్టర్ గా మంచి పేరున్న కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టి ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ బాగుంటాయని అనుకున్నారు. కానీ దానికి పూర్తి వ్యతికరేకంగా అడ్వాన్స్‌ బుకింగ్లు దారుణంగా ప్రారంభమయ్యాయి. పాటలు మరియు ప్రోమోల వంటి ప్రచార కంటెంట్ ఈ సినిమాలకు వర్కౌట్ కాలేదు, పండుగకు ముందు వాటితో బజ్ పెంచే ప్రయత్నం చేసే ఉండవచ్చు కానీ అది కూడా చేయలేదు. రెండు సినిమాలు ఊపందుకోవాలంటే పాజిటివ్ మౌత్ టాక్ అవసరం.

Mohammed Shami: షమీకి పెళ్లి ప్రపోజ్.. ట్వీట్ చేసిన బాలీవుడ్ నటి

ఇప్పటి వరకు అయితే ఈ రెండు చిత్రాలకు అన్ని ప్రాంతాల్లో తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. జపాన్, జిగర్తాండ డబుల్ ఎక్స్ మేకర్స్ తమిళనాడులో స్పెషల్ షోల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రత్యేక షోలను ప్రదర్శించడానికి ప్రభుత్వం వారిని అనుమతించింది. ఇక ఈ రెండు సినిమాల విషయానికి వస్తే ముందుగా జపాన్ కు రాజు మురుగన్ రచన, దర్శకత్వం వహించగా హీస్ట్ కామెడీ సినిమాగా తెరకెక్కించారు. చిత్రంగా అభివర్ణించబడింది మరియు CBFC ద్వారా U/A సర్టిఫికేట్ అందించబడింది. కార్తీతో పాటు అను ఇమ్మాన్యుయేల్, సునీల్, KS రవికుమార్, జితన్ రమేష్, బావ చెల్లదురై ఈ సినిమాలో నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. 200 కోట్ల విలువైన నగలు దోచుకున్న దొంగగా కార్తీ కనిపిస్తారని అంటున్నారు. ఇక జిగర్తాండ డబుల్ ఎక్స్ అనేది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన 2014 చిత్రం జిగర్తాండకి ప్రీక్వెల్. ఈ సినిమాకి CBFC U/A సర్టిఫికెట్ అందించింది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ -ఇవేనియో ఆరిజిన్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించగా, ఎస్ తిరునావుక్కరసు కెమెరాను హ్యాండిల్ చేశారు.