Babu Mohan Sensational Comments on Kirak RP: జబర్దస్త్ లో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో ఆర్పి కూడా ఒకడు. ఒకానొక సమయంలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్పి బయటకు వచ్చే సమయానికి టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. బయటకు వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక కర్రీ పాయింట్ పెట్టుకున్న ఆర్పి ఆ తర్వాత జబర్దస్త్ గురించి అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన కూటమికి మద్దతుగా మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా సహా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. అలాంటి ఆర్పీ మీద సీనియర్ నటుడు కమెడియన్ బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ రాకముందు నువ్వు ఎంత? నీ బతుకెంత? అంటూ ఆయన ప్రశ్నించారు.
Diamond: కార్మికుడ్ని వరించిన అదృష్టం.. రూ.80లక్షల విలువైన వజ్రం లభ్యం
పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చావు వచ్చాక నిన్ను నలుగురు గుర్తుపట్టేసరికి నీ కళ్ళు నెత్తికెక్కాయా? అని ఆయన అన్నారు. మల్లెమాల అంటే ఎవరు? చిత్ర సీమకే తండ్రి లాంటి ఎమ్మెస్ రెడ్డి గారు. జబర్దస్త్ నడిపే దానికి కొడుకు శ్యాం ప్రసాద్ రెడ్డి. అలాంటి ఒక గొప్ప సంస్థ నీకు అన్నం పెడితే అదే సంస్థ పై ఆరోపణలు చేయడానికి నీకు సిగ్గు లేదా? అన్నం పెట్టిన చేయని కొరుకుతావా అంటూ ఆర్ పి మీద ఆయన మండిపడ్డారు. అన్నం పెట్టిన చేయని కొరికితే ఆ తర్వాత అన్నం కూడా దొరక్కుండా పోతుంది. ఎంతోమందికి పని ఇచ్చి అన్నం పెట్టే ఆ సంస్థ ఇంకా బాగుండాలని కోరుకోవాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నాకు మంచి జీవితాన్ని ఇచ్చింది కూడా అదే సంస్థ నన్ను ఈ రోజు ఇంత పెద్ద స్టార్ ను చేసింది కూడా వాళ్లే అంటూ ఆయన మల్లెమాల మీద తనకున్న ప్రేమని వ్యక్తం చేశారు.