బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా డిఫరెంట్ స్టోరీలతో సూపర్ హిట్స్ కొడుతూ బాలీవుడ్‌లో కంటెంట్ కింగ్‌గా ఐడెంటిటీని సంపాదించుకున్నాడు. అండర్ బడ్జెట్ సినిమా తీస్తూ.. నిర్మాతల పాలిట బడ్జెట్ ఫ్రెండ్లీ హీరోగా మారాడు. కానీ ఈ మధ్య కాలంలో కమర్షియల్ రూట్‌లోకి వెళ్లి చేతులు కాల్చుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా. గర్ల్ ఫ్రెండ్2 వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ సినిమాలతో ఆకట్టుకున్న ఆయుష్మాన్ ఖురానా.. థామా నుండి రూట్ మార్చాడు. ఇప్పటి వరకు అతడి సినిమాల బడ్జెట్ రూ. 50 కోట్ల లోపే ఉండేది. కానీ థామాకు వంద కోట్లు పైనే ఖర్చు పెట్టింది మడాక్ ఫిల్మ్స్.. చివరకు ఆ సినిమా సోసో అనిపించుకుంది.
ఇక నెక్ట్స్ పతి పత్ని ఔర్ ఓ దో రూ. 60 కోట్లతో నిర్మిస్తే డిజాస్టరైంది. ఔట్ డేటెడ్ కంటెంట్‌తో వచ్చిన ఈ రెండు చిత్రాలు ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేదు.
బాలీవుడ్‌లో మంచి సక్సెస్ రేష్యోని మెయిన్ టైన్ చేస్తోన్న ఆయుష్మాన్ ఖురానా నుండి నెక్ట్స్ రెండు సినిమాలు రాబోతున్నాయి. స్పై కామెడీ ఉడ్తా టీర్ అక్టోబర్ 9న రిలీజౌతోంది. నవంబర్ బరిలో యే ప్రేమో మోల్ లియాతో వస్తున్నాడు. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది. డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న ఆయుష్మాన్ ఖురానా సాలిడ్ సక్సెస్ అందుకుని మళ్లీ కింగ్ ఆఫ్ కంటెంట్‌గా మారతాడా లేదా అనేది మరో రెండు నెలల్లో తేలనుంది.

