NTV Telugu Site icon

Average Student Nani: ఇంతకు తెగించారు ఏంట్రా?.. షర్ట్స్ లేకుండా హీరోహీరోయిన్ల లుక్ వైరల్

Average Student Nani

Average Student Nani

Average Student Nani First look: మెరిసే మెరిసే సినిమాతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్న పవన్ ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది.

Rakhi Sawant: టవల్ కట్టుకొని డాన్స్.. స్పృహ తప్పిన నటికి గర్భాశయ ట్యూమర్

ఈ రోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. బోల్డ్ అండ్ ఇంటెన్స్ గా కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఒక రేంజ్ లో పండినట్టు అర్థమవుతోంది. స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ చిత్రానికి ఎడిటర్. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వర్రలో తెలియనున్నాయి.