Atta Ettaga Lyrical Video Released: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న ‘సగిలేటి కథ’ పూర్తి స్థాయి రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగనున్న మూవీ. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్‌లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదలైన సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలో ఈ సినిమాలోని ‘అట్టా ఎట్టాగా’ అంటూ సాగుతున్న సెకండ్ లిరికల్ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ‘రధన్’ డిజిటల్ లాంచ్ చేసి సినిమా యూనిట్ కి విషెష్ తెలియజేసారు.
Bunny: ఏకంగా ఇన్స్టాగ్రామ్ దిగొచ్చింది.. దేశంలోనే మొదటి హీరో… ఇది బ్రాండ్ అంటే
అట్టా ఎట్టాగా పుట్టేసినావు
నన్నే ఇట్టాగా సంపేస్తున్నావు
సలికాలం సెగరేపే సలిమంటల్లాగా
నాలోన మంటేట్టినావే
ఇసుకల్లో నడిచొచ్చే ఓంటే పిల్లలాగా
నీదారే నాదంటూ దాహం తీర్చావే..!! అంటూ సాగుతున్న ఈ సాంగ్ కి రాజశేఖర్ సుద్మూన్, జశ్వంత్ పసుపులేటి సాహిత్యం అందించగా యశ్వంత్ నాగ్, కమల మనోహరి ఆలపించారు. జశ్వంత్ పసుపులేటి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సగిలేటి కథ సినిమాలో ప్రతి సాంగ్ ఎంతో ప్రత్యేకం అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దివంగత నటుడు, టీడీపీ నేత శివప్రసాద్ మేనల్లుడు టీడీపీ సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు నరసింహా ప్రసాద్ పంతగాని కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కథ కోడి కూర చుట్టూ తిరుగుతుందని ఇప్పటికే ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు.
