NTV Telugu Site icon

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా? ఈ వార్త మీ కోసమే!

Mythri Movie Makers Assistant Directors

Mythri Movie Makers Assistant Directors

Assistant Directors Crew Call for Mythri Movie Makers: చాలా మందికి సినీ రంగంలోకి ప్రవేశించి దర్శకులుగా మారాలని ఉంటుంది. కానీ అది ఎలా? ఏమిటి? అనే విషయం మీద పూర్తి అవగాహన ఉండదు. ఒకప్పుడు సీనియర్ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తూ పదోన్నతులు పొందుతూ చివరిగా దర్శకులు అయ్యేవారు. ఇప్పుడు ఎలాంటి అనుభవం లేకపోయినా దర్శకులుగా మారుతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికీ చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా సినీ రంగంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక వేళ మీరు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడడం రాయడంలో నైపుణ్యం ఉన్నవారైతే ఒక బ్లాక్ బస్టర్ టీంలో డైరెక్షన్ టీంలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా మారే అవకాశాన్ని కల్పిస్తోంది. తెలుగులో అలాగే హిందీలో రాయగల, మాట్లాడగల, అన్ని విషయాలు చేరవేయ గల నైపుణ్యం ఉన్న వారికి ఈ అవకాశం కల్పిస్తోంది.

Poonam Pandey: శృంగార తార పూనమ్ పాండే.. అసలు ఎవరీమె.. ఆమె నగ్న చరిత్ర ఏంటీ..?

అలాగే సినిమా సెట్ ఎక్స్పీరియన్స్ కూడా రెండేళ్లు మినిమం ఉండాలని పేర్కొన్నారు. ఒకవేళ అలా మీకు అవకాశం కావాలనుకుని వారు చెప్పిన అర్హతలు ఉంటే మీరు అప్ప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. పుష్ప రెండో భాగంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ- గోపీచంద్ మలినేని ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా మలయాళంలో టోవినో థామస్ తో చేస్తున్న లాల్ జూనియర్ డైరెక్టోరియల్ మూవీ కూడా ఉంది. అయితే ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు ఏ సినిమాకి వర్క్ చేయాల్సి ఉంటుందని విషయం మీద పూర్తిగా క్లారిటీ లేదు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. బహుశా వీరు ఆ టీమ్ లోనే జాయిన్ అవుతారేమో.