NTV Telugu Site icon

Ashwini Dutt: కాళ్ళు మొక్కబోయిన అమితాబ్‌.. అశ్వనీదత్‌ ఎమోషనల్‌!

Ashwini Dutt Emotional Post On Amitabh Incident

Ashwini Dutt Emotional Post On Amitabh Incident

Ashwini Dutt Emotional Post on Amitabh Incident: కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మన నిర్మాత అశ్వనీదత్‌ కాళ్ళు మొక్కే ప్రయత్నం చేయగా అందుకు అశ్వనీదత్‌ కూడా అమితాబ్ కాళ్ళు మొక్కే ప్రయత్నం చేశారు. ఇక ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను మించినవారు లేదంటూ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ ఆయనపై ప్రశంసలు కురిపింస్తూ పోస్ట్ పెట్టారు. ‘కల్కి’ ఈవెంట్‌లో ఆయన చేసిన పనికి తాను ఆశ్చర్యపోయానన్న దత్ ‘‘కల్కి’ వేడుకలో ఎన్నడూ ఊహించనిది జరిగిందని అన్నారు. అమితాబ్‌ చేసిన దానికి నేను ఆశ్చర్యపోయా, అయోమయానికి గురయ్యా, అయితే వెంటనే తేరుకొని ఆయన పాదాలను నేనూ తాకే ప్రయత్నం చేశానని అన్నారు.

Honey Moon Express Review: హెబ్బా పటేల్ హనీ మూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ రివ్యూ

జీవితంలో కొన్ని క్షణాలు ఎంతో అపురూపమైనవి, అలాంటి మధుర జ్ఞాపకాలను ఆ ఈవెంట్‌ అందించిందని అన్నారు. అమితాబ్‌ అంటేనే ఇండియన్‌ సినిమా యోధుడు, ఓ లెజెండ్‌, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఉన్న ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నా’’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీని అశ్వనీదత్‌ నిర్మించగా ప్రియాంక దత్, స్వప్న దత్ సహా నిర్మించారు. అమితాబ్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, రాజేంద్ర ప్రసాద్‌, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ ఫాన్స్ నిరుత్సాహంగా ఉన్నా సినిమా ప్రచారంలో భాగంగా రెండో ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్.