Site icon NTV Telugu

Ashish Vidyarthi : అలాంటి పాత్రలు ఇస్తేనే సినిమాలు చేస్తా.. ఆశిష్ విద్యార్థి కామెంట్స్

Ashish

Ashish

Ashish Vidyarthi : స్టార్ యాక్టర్ ఆశిష్ విద్యార్థికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాదాపు అన్ని భాషల్లో ఆయన సినిమాలు చేశారు. 30 ఏళ్ల కెరీర్ లో 300లకు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యారు. రీసెంట్ గా ఆయన సినిమాలు తగ్గించేశారు. ఎక్కడా కనిపించట్లేదు. దీంతో ఏమైందా అని ఆయన ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. తాజాగా ఆయన ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. నేను ఎందుకు సినిమాలు చేయట్లేదో అని చాలా మంది అడుగుతున్నారు. వారికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను ఇప్పుడు సినిమాలు చేయకపోయినా గ్రేట్ యాక్టర్ నే. 300లకు పైగా సినిమాల్లో నటించాను. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో చేశాను. కానీ ఇప్పుడు బోర్ కొడుతోంది. రెగ్యులర్ గా చిన్న పాత్రలే వస్తున్నాయి.

Read Also : PVNS Rohit : మొన్నే నేషనల్ అవార్డు.. నేడు ఎంగేజ్ మెంట్ చేసుకున్న సింగర్

అందుకే చేయట్లేదు. ఇంపార్టెంట్ పాత్రలు వస్తేనే చేస్తానని ఇప్పటికే డైరెక్టర్లకు చెప్పాను. సినిమాల్లో కీలక పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే చిన్న పాత్రల్లో నటించట్లేదు. రొటీన్ పాత్రలు చేయాలని అనుకోవట్లేదు. మనం కొత్తగా చేసినప్పుడే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నా కెరీర్ నిలబడటానికి కారణం కూడా అదే. ఈ నడుమ అన్నీ తేలికపాటి పాత్రలే వస్తుండటంతో రిజెక్ట్ చేస్తున్నా. ఒకవేళ కీలక పాత్రలు రాకపోతే సినిమాలు మానేస్తా. అంతేగానీ చిన్న పాత్రలు చేయను అంటూ తేల్చి చెప్పారు ఆశిష్. రీసెంట్ గానే ఆయన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Read Also : Anchor Ravi : ఆ యాంకర్ నాపై చేతబడి చేయించింది.. రవి షాకింగ్ కామెంట్స్

Exit mobile version